టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని హైదరాబాద్ గోశామహల్ పోలీసు మైదానంలో దీక్ష చేస్తున్న అభ్యర్థులకు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడానికి ప్రగతి భవన్ వెళ్లిన టీఆర్టీ అభ్యర్థులను అన్యాయంగా అరెస్టు చేయటం దారుణమని కృష్ణయ్య మండి పడ్డారు. నియామకాలపైన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవటం బాధాకరమన్నారు. తక్షణమే టీఆర్టీ నియామకాలు చేపట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: సర్కార్ బడుల్లో చదువుల పండుగ...