ETV Bharat / briefs

నేడు నిజామాబాద్​లో ఈసీ రజత్‌ కుమార్ పర్యటన - నిజామాబాద్​

నిజామాబాద్​లో పోలింగ్ ఏర్పాట్లు ఇవాళ్టి నుంచి వేగవంతం కానున్నాయి. ఈరోజు ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇందూరు కోసం సీనియర్ అధికారి రాహుల్ బొజ్జాను ప్రత్యేకాధికారిగా నియమించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్ నేడు నిజామాబాద్​లో పర్యటించి ఈవీఎంల సన్నద్ధత, పోలింగ్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

నేడు నిజామాబాద్​లో ఈసీ రజత్‌ కుమార్ పర్యటన
author img

By

Published : Apr 3, 2019, 6:24 AM IST

Updated : Apr 3, 2019, 7:44 AM IST

నేడు నిజామాబాద్​లో ఈసీ రజత్‌ కుమార్ పర్యటన
చరిత్రలోనే తొలిసారిగా ఎక్కువ మంది అభ్యర్థులున్నప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​లోని ఈసీఐఎల్, బెంగళూరులోని బెల్ కంపెనీలకు చెందిన ఆధునిక ఎంత్రీ ఈవీఎంలను ఇందుకోసం వినియోగిస్తున్నారు.

600 మంది ఇంజినీర్లు

ఇప్పటికే కొన్ని యంత్రాలు ఇందూరు చేరుకోగా... మిగతా యంత్రాలు ఇవాళ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. యంత్రాల మొదటి దశ తనిఖీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం 600 మంది ఇంజినీర్లు నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో అందుబాటులో ఉండనున్నారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నందున అదనపు పోలింగ్ సిబ్బందితో పాటు సెక్టోరల్ అధికారులను కూడా వినియోగించనున్నారు. అటు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయి శిక్షకులతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేకాధికారి నియామకం

కేవలం నిజామాబాద్​లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పర్యవేక్షణ కోసం ఓ అధికారిని కూడా నియమించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం నిజామాబాద్ ఎన్నిక కోసమే ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

రజత్‌ పర్యటన

అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్ కూడా నేడు నిజామాబాద్​లో పర్యటించనున్నారు. ఈవీఎంల సన్నద్ధత, పోలింగ్ ఏర్పాట్లను సీఈఓ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. 12 బ్యాలెట్ యూనిట్లు యూ ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఆ నమూనాను ఫ్లెక్సీలు, హోర్డింగ్ ల ద్వారా ప్రదర్శించేలా ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చూడండి:ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలె: కేటీఆర్​

Intro:Hyd_tg_07_03_asad_owaisi_public_meeting_ab_c18.
md sulthan 9394450285.

చేవెళ్ల trs ఎంపీ అభ్యర్థి కి మద్దతుగా ప్రచారం చేసిన ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ

మంగళవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గం లోని షాహీన్ నగర్ ప్రాంతంలో trs పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిధిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు, చేవెళ్ల trs ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు,
షాహీన్ నగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఉన్న నీటి సమస్యను trs ఎంపీ అభ్యర్థి గెలిచిన 3 నెలలో 50లక్షల వ్యయం తో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు,
ఈ సభకు trs నేత కార్తీక్ రెడ్డి, trs నేతలు, mim ,ఎంపీటీసీ లు, నేతలు పాల్గొన్నారు.
ఈ సభకు చేవెళ్ల trs ఎంపీ అభ్యర్థి హాజరు కాలేదు,

బైట్.. ఎంఐఎం ఎంపీ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ.

Body:షాహీన్ నగర్

Conclusion:మహేశ్వరం
Last Updated : Apr 3, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.