రెండు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి దూసుకెళ్తోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గి మిగతా మూడింటిలో పరాజయం పాలైంది రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు జట్లు జైపుర్ వేదికగా నేడు తలపడనున్నాయి.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది కోల్‌కతా, దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాజస్థాన్. రసెల్ విధ్వసంతో కోల్‌కతా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 48 పరుగులు చేసి పెను విధ్వంసమే సృష్టించాడు రసెల్.
బెన్ స్టోక్స్, బట్లర్ లాంటి హిట్టర్లు రాజస్థాన్ సొంతం.
కోల్‌కతా నైట్ రైడర్స్..
కోల్‌కతా జట్టులో క్రిస్‌లిన్, నితీశ్ రానా, రాబిన్ ఉతప్ప, శుభమాన్ గిల్, దినేశ్ కార్తీక్ లాంటి బ్యాట్స్‌మెన్ టాప్ఆర్డర్ బలంగా ఉంది. చివర్లో మెరుపులు మెరిపించడానికి రసెల్ ఎలాగూ ఉన్నాడు. ఇప్పటి వరకూ కోల్‌కతా గెలిచిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ రసెల్ పాత్రే కీలకం. ఓటమి అంచున ఉన్న జట్టును తన బ్యాటింగ్‌తో మాయ చేసి గెలిపిస్తున్నాడు. బౌలింగ్‌లో స్పిన్ త్రయం నరైన్, కుల్దీప్ యాదవ్, పియూష్ చావ్లాతో పటిష్ఠంగా ఉంది.
-
BLISTERING STUFF, MAN!!!!👌💥
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch this if you wanna know how @Russell12A trained in the nets 1⃣ day before his 🔥 blitzkrieg vs @RCBTweets in Bangalore! 😍
Full video 👉 https://t.co/ZrBbsTkCgQ#KKRPrimetime #KKRHaiTaiyaar pic.twitter.com/jnVgvzxymq
">BLISTERING STUFF, MAN!!!!👌💥
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2019
Watch this if you wanna know how @Russell12A trained in the nets 1⃣ day before his 🔥 blitzkrieg vs @RCBTweets in Bangalore! 😍
Full video 👉 https://t.co/ZrBbsTkCgQ#KKRPrimetime #KKRHaiTaiyaar pic.twitter.com/jnVgvzxymqBLISTERING STUFF, MAN!!!!👌💥
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2019
Watch this if you wanna know how @Russell12A trained in the nets 1⃣ day before his 🔥 blitzkrieg vs @RCBTweets in Bangalore! 😍
Full video 👉 https://t.co/ZrBbsTkCgQ#KKRPrimetime #KKRHaiTaiyaar pic.twitter.com/jnVgvzxymq
రాజస్థాన్ రాయల్స్
స్టోక్స్, బట్లర్, రహానే, స్మిత్ లతో బ్యాటింగ్ లైనప్ శక్తిమంతంగా ఉంది. సంజూ శాంసన్ జోరు మీద ఉన్నాడు. బౌలింగ్‌లో స్టోక్స్, ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్ పదునైన బంతుల విసరగల సమర్థులే. గూగ్లీ స్పెషలిస్టు శ్రేయాస్ గోపాల్ రాజస్థాన్‌కు మరో పెద్ద అస్త్రం. బెంగళూరుతో మ్యాచ్‌లో 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
-
A Sunday-knight encounter is just around the corner!
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The lads are preparing hard for the game! 💪
What are your match day preps like? #HallaBol pic.twitter.com/vzyImBhRSE
">A Sunday-knight encounter is just around the corner!
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2019
The lads are preparing hard for the game! 💪
What are your match day preps like? #HallaBol pic.twitter.com/vzyImBhRSEA Sunday-knight encounter is just around the corner!
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2019
The lads are preparing hard for the game! 💪
What are your match day preps like? #HallaBol pic.twitter.com/vzyImBhRSE
బెంగళూరుతో మ్యాచ్‌లానే మరో భీకర ఇన్నింగ్స్ ఆడాలని చూస్తోంది కోల్‌కతా. రసెల్‌ని కట్టడి చేసి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది రాజస్థాన్ రాయల్స్.
జట్ల అంచనా..
కోల్‌కతా నైట్ రైడర్స్:
దినేశ్ కార్తిక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీశ్ రానా, రసెల్, శుభ్‌మాన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ల్యూక్ ఫెర్గ్యూసన్, ప్రసిధ్ కృష్ణ.
రాజస్థాన్ రాయల్స్:
అజింక్యా రహానే(కెప్టెన్), బట్లర్(కీపర్),స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బిన్ని, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ధవల్ కులకర్ణి.
ఇవీ చదవండి: