ప్రస్తుతం దేశ ప్రజలు ప్రధానిగా మోదీని ఎన్నుకోవాలా? లేక రాహుల్ గాంధీని గద్దెనెక్కించాలా అనే ఆలోచనలో ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి కుటుంపడిందని విమర్శిచారు. అనేక అక్రమాలు వెలుగు చూశాయని ఆరోపించారు. హామీల అమలులో మోదీ సర్కారు విఫలమైందని ఎద్దేవా చేశారు. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓడిపోయి ఫామ్‌హౌస్‌లో కూర్చునే పార్టీ కాదని పొన్నాల అన్నారు.
ఇదీ చదవండి:ఆర్థిక నేరగాళ్లకే మోదీ కాపలాదారు : సిబల్