ETV Bharat / briefs

ముగిసిన నౌహీరా షేక్​ ఈడీ కస్టడీ

హీరాగోల్డ్​ వ్యవస్థాపకురాలు నౌహీరాషేక్​ పోలీసు కస్టడీ ముగిసింది. వారం రోజుల పాటు ఈడీ అధికారులు.. నౌహీర్​ షేక్, మౌళి థామస్​, బిజూ థామస్​లను విచారించారు. తిరిగి చంచల్​గూడ జైలుకు వారిని తరలించారు.

నేటీతో ముగిసిన నౌహీరా షేక్​ ఈడీ కస్టడీ
author img

By

Published : May 21, 2019, 7:09 PM IST

నేటీతో ముగిసిన నౌహీరా షేక్​ ఈడీ కస్టడీ

హీరా గ్రూప్​ సంస్థ వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్​ ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు మళ్లించారనే ఆరోపణలపై నౌహీరా షేక్​ ఆమె అనుచరులు మౌలీ థామస్, బిజూ థామస్​లను ఈడీ అధికారులు ఏడు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈరోజుతో గడువు ముగియగా... చంచల్​గూడ జైలుకు తరలించారు.

ఎక్కువ వడ్డీ ఆశ చూపి

నౌహీరా షేక్​ ఎక్కువ వడ్డీ ఆశ చూపి భారీ ఎత్తున డిపాజిట్లు స్వీకరించారనే ఆరోపణలపై నౌహీరా షేక్​ను విచారించారు. లక్షకు పైగా డిపాజిటర్ల నుంచి సుమారు 6వేల కోట్ల పెట్టుబడులు స్వీకరించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

మరిన్ని ఆధారాలు

విదేశాల నుంచి నిధులు ఎలా సేకరించారు.. వాటిని భారత్​కు ఎలా తరలించారు, దేశీయంగా వాటిని ఎలా వినియోగించారన్న దానిపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించినప్పటికీ ఆమె ముఖ్తసరి సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది. డిపాజిటర్లను మోసం చేయలేదని, తన వ్యాపారాన్ని సమర్థించుకున్నట్లు సమాచారం. విదేశీ నిధుల సమీకరణలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు.

ఇదీ చూడండి : పదకొండు రోజుల్లో ఎలా సాధ్యమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.