ETV Bharat / briefs

టీవీ 9 రవిప్రకాశ్, శివాజీ​కి పోలీసుల నోటీసులు - టీవీ 9 రవిప్రకాశ్, శివాజీ​కి పోలీసుల నోటీసులు

బ్రేకింగ్​ న్యూస్​ అంటూ... హడావుడి చేసే టీవీ9 ఛానల్...​ ఇప్పుడు అన్ని మీడియాల్లో బ్రేకింగ్​ న్యూస్​గా మారింది.  యాజమాన్య విభేదాల అంశం కొత్త మలుపు తిరిగింది. అలంద మీడియా కార్యదర్శి కౌశిక్​రావు ఫిర్యాదుతో రవిప్రకాశ్​తో పాటు నటుడు శివాజీ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులిచ్చారు.

కొత్త మలుపు...
author img

By

Published : May 9, 2019, 5:09 PM IST

కొత్త మలుపు...

టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్​ చిక్కుల్లో పడ్డారు. సంస్థ యాజమాన్య హక్కుల బదిలీలో విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. టీవీ9ను టేకోవర్‌ చేసిన అలంద మీడియా... కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు కనిపించడం లేదని... కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఉదయం నుంచి తనిఖీలు

రవిప్రకాశ్​పై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. సంస్థ కార్యాలయంతో పాటు, రవిప్రకాశ్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. టీవీ9 వాటాల అమ్మకం, యాజమాన్యం మార్పిడికి సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. ఇటీవల కాలంలో టీవీ9 ను అలంద మీడియా టేకోవర్‌ చేసింది. అప్పటి నుంచి కొత్త డైరెక్టర్ల నియామకం విషయంలో వివాదం కొనసాగుతోంది. ఇవాళ కౌశిక్ రావు ఫిర్యాదుతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
రవిప్రకాష్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు... సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు సైబరాబాస్​ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. తనీఖీల సమయంలో రవిప్రకాశ్ ఇంట్లో లేకపోవటం వల్ల ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు అందించారు.

శివాజీ ఇంట్లోనూ....

ఈ వ్యవహారంలో నటుడు శివాజీ పాత్ర కూడా ఉందన్న ఆరోపణతో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఆయన ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. టీవీ9 రవిప్రకాశ్​తో కలిసి కీలక పత్రాలు ఫోర్జరీ చేశారని అలంద సంస్థ డైరెక్టర్​ ఫిర్యాదు చేయగా... పోలీసులు శివాజీ కుటుంబ సభ్యులకు సీఆర్​పీసీ160 కింద నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చూడండి: టీవీ9 సీఈఓగా రవిప్రకాశ్​ తొలగింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.