ETV Bharat / briefs

ప్రభాస్​కు చెల్లిగా నివేదా థామస్​!

దర్శకుడు నాగ్​ అశ్విన్​, హీరో ప్రభాస్​ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో డార్లింగ్​కు సోదరిగా నివేదా థామస్ నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Aug 22, 2020, 10:27 AM IST

Updated : Aug 22, 2020, 10:51 AM IST

Nivetha Thomas
నివేదా థామస్

చక్కని ఆహార్యాభినయంతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్​ నివేదా థామస్​. అయితే తాజాగా ప్రభాస్​ హీరోగా దర్శకుడు నాగ్​ అశ్విన్​ తెరకెక్కిస్తున్న సినిమాలో డార్గింగ్​కు సోదరి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇటీవలే నాగ్​ అశ్విన్​ నివేదాను కలిసి తన పాత్రను వివరించగా.. ఆమెకు విపరీతంగా నచ్చిందట. త్వరలోనే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో ప్రభాస్​ 21వ చిత్రం ఖరారైనట్లు వైజయంతి మూవీస్​ అధికారికంగా ప్రకటించింది. పాన్​ ఇండియా సినిమాగా రూపొదించనున్నట్లు స్పష్టం చేసింది.సైన్స్​ ఫిక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె ఈ సినిమాలో డార్లింగ్​ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాతే నాగ్​ అశ్విన్​తో చిత్రం పట్టాలెక్కనుంది. కాగా నివేదా.. నాని 'వి' సినిమాతో సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చూడండి 'ఆదిపురుష్' గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చా!

Last Updated : Aug 22, 2020, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.