ETV Bharat / briefs

భారత్​ నుంచి లండన్ పరారైన నేరగాళ్లపై పుస్తకం

author img

By

Published : Mar 22, 2021, 8:25 AM IST

భారత్​ నుంచి బ్రిటన్ పరారైన ప్రముఖ నేరస్థులపై లండన్​ కేంద్రంగా పనిచేసే ప్రముఖ పాత్రికేయులు డానిష్​, రుహీ ఖాన్​లు పుస్తకం రచించారు. 'ఎస్కేప్డ్​ : ట్రూ స్టోరీస్​ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్​ ఇన్ లండన్' పేరిట రూపొందిన ఈ పుస్తకంలో 12 కేసులను ప్రస్తావించామన్నారు.

london
భారత్​ నుంచి లండన్ పరారైన నేరగాళ్లపై పుస్తకం

భారత్​లో నేరాలకు పాల్పడి, బ్రిటన్​కు పరారైన ప్రముఖుల బాగోతాలను వివరిస్తూ తాజాగా ఒక పుస్తకం ప్రచురితమైంది. 'ఎస్కేప్డ్​ : ట్రూ స్టోరీస్​ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్​ ఇన్ లండన్' పేరిట రూపొందిన ఈ పుస్తకంలో కింగ్​ ఫిషర్ మాజీ అధిపతి విజయ్​ మాల్య, వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ, నౌకాదళ మాజీ అధికారి రవి శంకరన్, సంగీతకారుడు నదీమ్ సైఫీ తదితరుల వ్యవహారాలను పొందుపరిచారు. లండన్ కేంద్రంగా పనిచేసే పాత్రికేయులు, పరిశోధకులు డానిష్​, రుహీ ఖాన్​లు దీన్ని రచించారు.

భారత చట్టాలను తప్పించుకోవాలనుకునేవారికి బ్రిటన్ స్వర్గధామంగా మారడానికి కారణాలను ఇందులో వివరించినట్లు తెలిపారు. 12 కేసులను ఈ పుస్తకంలో ప్రస్తావించామని చెప్పారు. వాటిలో రుణ ఎగవేతల నుంచి హత్యల వరకు అనేక నేరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేర సామ్రాజ్యం క్రికెట్​-బాలీవుడ్​ మధ్య ఉన్న సంబంధాలు, భారత్​-పాకిస్థాన్​ దౌత్య యుద్ధాల గురించి ఇందులో ప్రస్తావించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి : పంజాబ్​​ సరిహద్దులో పాక్​ జాతీయుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.