ETV Bharat / briefs

ఎమ్మెల్సీగా నవీన్​ రావు ఎన్నిక లాంఛనం!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. తెరాస తరఫున నవీన్ రావు ఒక్కరే నామపత్రాలు దాఖలు చేశారు. గడవు ముగిసే సమయానికి నవీన్ రావు నామినేషన్ ఒక్కటి మాత్రమే దాఖలైంది. ఎన్నిక లాంఛనం కానుంది.

naveen rao
author img

By

Published : May 28, 2019, 5:54 PM IST

Updated : May 28, 2019, 8:04 PM IST

ఎమ్మెల్సీగా నవీన్​ రావు ఎన్నిక లాంఛనం!

శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. తెరాస నేత కె.నవీన్ రావు ఒక్కరే నామపత్రాలు దాఖలు చేసినందున... ఆయన ఎన్నిక లాంఛనంగా ప్రకటించడమే మిగిలింది. తెరాస నుంచి నవీన్ రావు బరిలో ఉండగా... విపక్షాలు పోటీకి విముఖత చూపాయి.

మైనంపల్లి రాజీనామాతో ఖాళీ

ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు శాసనమండలికి రాజీనామా చేయడం వల్ల... ఆ స్థానానికి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నవీన్ రావు రెండు సెట్ల నామపత్రాలు సమర్పించారు.

31న అధికార ప్రకటన

నవీన్ రావు వెంట తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి, తదితరులు నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 31న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నవీన్ రావు ఎన్నికను లాంఛనంగా ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: నవీన్​ రావు నామినేషన్​ దాఖలు

Intro:Body:Conclusion:
Last Updated : May 28, 2019, 8:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.