ఎంఎన్‌జే ఆస్పత్రిలో నూతనంగా నిర్మించనున్న కేన్సర్ బ్లాక్‌కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిసరాల్లో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ భవనాన్ని 40 కోట్ల వ్యయంతో అరబిందో ఫార్మా యాజమాన్యం నిర్మించనుందని వెల్లడించారు. దాదాపు 200 పడకల సౌకర్యంతో ఈ బ్లాక్ అందుబాటులోకి రానుంది. బీడీఎల్ ఇండియా సంస్థ ఎంఎన్‌జేకు అందిస్తున్న వైద్య పరికరాలను మంత్రి ఈటల పరిశీలించారు. బోధనాసుపత్రిలో ప్రొఫెసర్ల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచినట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి : అప్పు కట్టలేదని మహిళపై అమానుషం