రాష్ట్ర మంత్రి మండలి భేటీ జూన్ తొలి వారంలో జరగనుంది. మొదట ఈనెల 28న నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినా పలు కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలను రూపొందించి మంత్రి మండలి ఆమోదం తీసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చట్టాలు సిద్ధం కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికలు, వచ్చే వారం రాష్ట్రావతరణ వేడుకల వల్ల మంత్రి మండలి సమావేశాలు వాయిదా వేశారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఎజెండా అంశాలు మండలికి చేరాయి.
ఇదీ చూడండి : అంతా చేశారనుకుంటే... అసంపూర్తిగా వదిలేశారు