టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి చాలా విలువ ఇస్తారనే సంగతి తెలిసిందే. "ఇల్లు బాగుంటే మనం బాగుంటాం.. షూటింగ్‌లో కష్టపడిన అనంతరం ఇంటికి వెళితే ప్రశాంత వాతావరణం ఉండాలి.. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ని..." అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవటం వల్ల ఆయన తన సమయాన్ని పిల్లలు గౌతమ్, సితారలతో ఆనందంగా గడుపుతున్నారు. మరి ఈ 'శ్రీమంతుడు' ఇంట్లో లేనప్పుడు ఎక్కడ ఉంటారనే విషయాన్ని ఆయన సతీమణి నమ్రత... అభిమానులతో పంచుకున్నారు.
మహేశ్ తమతో లేకుంటే... ఆయనకు ఎంతో ఇష్టమైన చోట ఉన్నట్టే అని ఆమె అన్నారు. అయితే అది ఏ సినిమా సెట్టో కాకుండా.. మహేష్ చాలా ఇష్టమైన ప్రదేశమని.. ముద్దుగా లయన్స్ డెన్ (సింహం గుహ) అని పిలుస్తానని చెప్పారు. అదే మహేశ్ సొంత జిమ్ అని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మహేశ్ తన జిమ్‌లో ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేస్తున్న వీడియోను నమ్రత అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. "అంతా ఇక్కడే జరుగుతుంది.. ఆయన హోం జిమ్‌లో. మహేశ్‌కు పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్. మాస్టర్స్ డెన్. ఆయన ఇంట్లో లేనపుడు ఎక్కడ ఉంటారో తెలిసింది కదా!" అని వ్యాఖ్య రాసుకొచ్చారు నమ్రత.
ప్రస్తుతం మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇది చూడండి రోల్ రైడా 'నాగలి' సాంగ్‌కు భారీ స్పందన