ప్రేమ అనే మాటకు అర్థం తెలియకుండానే... కొన్ని జీవితాలు ముగిసిపోతున్నాయి. మైనర్ ప్రేమలు విషాదం నింపుతున్నాయి. ఆకర్షనే ప్రేమగా భావించి ఆవేశంతో ప్రాణాలు కోల్పోతున్నారు. 18ఏళ్లు నిండక ముందే ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణను, ఇష్టాన్ని ప్రేమ అనుకుని పొరబడుతున్నారు. వాళ్లు లేకపోతే బతకలేమని మానసికంగా నిర్ధరించుకుంటున్నారు. ప్రాణాల్ని తీసుకునే స్థాయికి దిగజారుతున్నారు.
తాజాగా రెండు ఘటనలు జరిగాయి. ప్రేమ కోసం మైనర్ అమ్మాయి దేశం దాటి... హైదరాబాద్ కుర్రాడి కోసం వచ్చింది. ఆ అబ్బాయి... అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నాడు. చివరకు పోలీసులు అపహరణ కేసు కింద అదుపులోకి తీసుకున్నారు. చివరకు ఆ యువతి ఏం సాధించింది. మైనర్ అమ్మాయి కావడం వల్ల పోలీసులు ఆ యువకుడిని జైళ్లో పెట్టారు. కళ్లేదుటే.. ప్రేమించిన వ్యక్తిని ఆ అమ్మాయి జైలు పాలు చేసినట్టయింది.
మరో ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మైనర్ అమ్మాయి ఓ యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని పురుగుల మందు తాగారు. ప్రేమలో విఫలమయ్యామని... కలిసి బతకలేమని మనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న సినిమా ప్రభావం కావొచ్చు... లేదా పెరిగే వాతావరణం కావొచ్చు ఏదేతైనేం...చిన్నతనంలోనే ఏవో ఆకర్షణలకు గురై ప్రేమగా భావిస్తున్నారు. ఏది మంచో ఏది చెడో తెలియని వయస్సులో ప్రేమలో పడుతున్నారు.5 సంవత్సరాలు పాలించే ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే... 18 ఏళ్లు నిండితే కానీ ఓటు హక్కు ఉండదు. మరి జీవింతాంతం మనకు తోడుండే వ్యక్తిని 18 ఏళ్లు నిండకుండానే ఎలా ఎంపిక చేసుకుంటాం?మీరే ఒక్కసారి ఆలోచించండి...!
ఇదీ చూడండి: సార్వత్రిక రెండో దశలో 67.84 శాతం పోలింగ్