దాదాపు 60శాతం గ్రామీణ భారతదేశానికి ప్రభుత్వం అమలు చేసిన రుణ పథకాల ఫలాలు అందట్లేదని తాజా సర్వేలో తేలింది. అయిదింట ఒక రైతుకు వాతావరణ మార్పులు పెద్ద సవాలుగా మారినట్టు సర్వే తెలిపింది.
దేశంలోని 19 రాష్ట్రాల్లో రైతుల ప్రస్తుత పరిస్థితిపై 'గావ్ కనెక్షన్స్' అనే గ్రామీణ మీడియా వేదిక సర్వే నిర్వహించింది. మరికొన్ని రోజుల్లో కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ సర్వే విడుదల చేసింది.
సర్వేలోని మరిన్ని అంశాలు...
- రైతు కుటుంబానికి చెందిన తదుపరి తరంలోని 48 శాతం అసలు వ్యవసాయమే వద్దనుకుంటున్నారు.
- 43.6 శాతం అన్నదాతలు తామ కష్టపడి పండించిన వాటికి తగిన ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- సరైన అవగాహన లేక 59 శాతం మంది రైతులకు రుణాలు అందడం లేదు.
- 62 శాతం రైతులు ప్రభుత్వానికి బదులు తమ పంటకు తామే ధరలు నిర్దేశించే అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. కేవలం 30 శాతం అన్నదాతలే ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో సంతృప్తిగా ఉన్నారు.
- గ్రామాల్లో ఉండే ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు నీటి కోసం అర కిలోమీటర్ మేర నడావల్సిన పరిస్థితి నెలకొంది ఉంది. 8 శాతం గ్రామాలకే పంపుల ద్వారా నీరు అందుతోంది.
- గ్రామాల్లో నివసిస్తున్న 30 శాతం మంది సామాజిక మాధ్యమాల కోసం ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. 15 శాతం మందికి అసలు స్మార్ట్ ఫోనే లేదు.
ఇదీ చూడండి:- చావు అంచులదాకా పోయాడు..మొత్తానికి బతికాడు