నూర్ సుల్తాన్‌లో పాకిస్థాన్‌తో డెవిస్‌కప్ పోరును ఘనంగా కొనసాగిస్తోంది భారత్. ఐదు మ్యాచ్‌ల్లో ఇప్పటికే 2-0 ఆధిక్యంతో ఉన్న భారత జట్టు.. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో విజయం సాధించింది. డబుల్స్‌లో పేస్, నెదుంచెజియన్ ద్వయం 6-1, 6-3 తేడాతో హుఫైజా-షోయబ్ జోడీని ఓడించింది.
ఈ తాజా గెలుపుతో ఆధిక్యాన్ని 3-0కు పెంచుకున్నారు భారత ఆటగాళ్లు. అదే కాకుండా కెరీర్లో 44వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు లియాండర్ పేస్. డెవిస్ కప్‌లో తన అత్యధిక విజయాల రికార్డును తనే బ్రేక్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటలీ దిగ్గజ ఆటగాడు నికోలా(66 టై, 42 విజయాలు) రికార్డును అధిగమించాడు. పేస్ ప్రస్తుతం 56 టై, 44 విజయాలతో ఉన్నాడు.
ఇంతకుముందు...
తొలి రోజైన శుక్రవారం సింగిల్స్ మ్యాచ్‌ల్లో సుమిత్ నగాల్, రామ్‌కుమార్ రామనాథన్‌లు అనుభవం లేని పాక్ ప్రత్యర్థులపై అలవోకగా గెలిచారు. కేవలం 42 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6-0, 6-0తో మహ్మద్ షోయబ్‌ను చిత్తు చేశాడు. రెండో సింగిల్స్‌లో సుమిత్ 6-0, 6-2తో అబ్దుల్ రెహ్మన్‌ను మట్టికరిపించాడు. నాలుగో మ్యాచ్ ( రివర్స్ సింగిల్స్) నేడు జరగనుంది. ఐదో మ్యాచ్ ఆడాలో వద్దో జట్లు నిర్ణయించుకోవచ్చు. గతంలో పాకిస్థాన్‌తో తలపడ్డ ఆరుసార్లూ భారత జట్టే గెలిచింది.
ఇవీ చూడండి.. పాకిస్థాన్‌పై భారత్ విజయం.. 2-0తో ఆధిక్యం