కోల్‌కతాతో మ్యాచ్‌లో అద్భుతమైన యార్కర్ వేసిన దిల్లీ బౌలర్ రబాడ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు వాటికి దీటైన సమాధానమిచ్చేందుకు పంజాబ్ బ్యాట్స్‌మెన్ సిద్ధమవుతున్నారు. మొహలీ వేదికగా జరిగే నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ప్రధానంగా రబాడపైనే ఉండనుంది. ప్రత్యర్థి జట్టులో గేల్, రాహుల్, మయాంక్ లాంటి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ని ఎలా అడ్డుకుంటాడా అని అభిమానులు చూస్తున్నారు.
Good wins are a result of perfect practice! 💪
— Delhi Capitals (@DelhiCapitals) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's a look back to some training drills at #QilaKotla! 👊#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/LUMqDsECnw
">Good wins are a result of perfect practice! 💪
— Delhi Capitals (@DelhiCapitals) March 31, 2019
Here's a look back to some training drills at #QilaKotla! 👊#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/LUMqDsECnwGood wins are a result of perfect practice! 💪
— Delhi Capitals (@DelhiCapitals) March 31, 2019
Here's a look back to some training drills at #QilaKotla! 👊#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/LUMqDsECnw
శనివారం జరిగిన మ్యాచ్‌లలో రెండు జట్లు వేర్వేరుగా విజయాలు నమోదు చేశాయి. ఇరుజట్లలోని ఓపెనర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి.
బ్యాటింగ్‌లో బలంగా దిల్లీ...
కోల్‌కతాతో మ్యాచ్‌లో కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న దిల్లీ ఓపెనర్ పృథ్వీషా మరోసారి చెలరెగేందుకు సిద్ధమవుతున్నాడు.ఇతర బ్యాట్స్మెన్లలో పంత్, శ్రేయస్ అయ్యర్, ధావన్, ఇంగ్రామ్ మరోసారి బ్యాట్‌కు పనిచెపితే ప్రత్యర్థి ముందు భారీ స్కోరు విధించే అవకాశముంది. దిల్లీ బౌలర్లలో రబాడ, హర్షల్ పటేల్, సందీప్ లామిచానె, బౌల్డ్, ఇషాంత్.. తమ వైవిధ్యమైన బంతులతో పరుగులు నియంత్రిస్తూ ఆకట్టుకుంటున్నారు.
పంజాబ్‌లో గేల్, మయాంక్....
పంజాబ్ బ్యాట్స్మెన్లలో రాహుల్, గేల్, మయాంక్.. సొంతగడ్డపై అలరించేందుకు రెడీ అవుతున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న వీరిపైనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశలు పెట్టుకుంది.బౌలర్లలో మురుగన్ అశ్విన్, షమి, టై, విజిలెన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పనిపట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
జట్లు (అంచనా)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), గేల్, రాహుల్, షమి, మయాంక్ అగర్వాల్, మిల్లర్, విలిజెన్, సర్ఫరాజ్ ఖాన్,మురుగన్ అశ్విన్, ఆండ్రూ టై, మన్దీప్ సింగ్.
దిల్లీ క్యాపిటల్స్:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, పంత్, హనుమ విహారి, ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, సందీప్ లామిచానె, హర్షల్ పటేల్, బౌల్ట్, అమిత్ మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ