ఆవిష్కరణలు అభివృద్ధికి ఊతమిస్తాయని.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో "మేడ్ ఇన్ హైదరాబాద్" పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరానికి చెందిన 25 మంది విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుల స్ఫూర్తి దాయక ప్రయాణాన్ని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. వీరందరికీ ఈ పుస్తక కాపీలను కేటీఆర్ అందజేశారు. అంకుర స్థాపన అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని.. స్టార్టప్‌లు ప్రభుత్వ సహకారం కోసం వేచి చూడకుండా ముందుకు సాగాలని కేటీఆర్ అన్నారు. దేశ అభివృద్ధిలో ఆవిష్కరణ, సమ్మిళిత వృద్ధి, మౌలిక వసతులు, దేశీయ రక్షణ ముఖ్య భూమిక పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని ఆకాంక్షించారు.
ఆ నగరాలతో పోలిస్తే..
మెట్రో నగరాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నై, బెంగళూరు, దిల్లీ, ముంబయి వాతావరణాలు, అక్కడి ప్రభుత్వాలపై సునిశిత విమర్శలతో ఛలోక్తులు విసిరారు. ఆ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వాతావరణం వ్యాపార అనుకూలమని.. చక్కటి వాతావరణంతో పాటు.. మంచి బిర్యానీ కూడా దొరుకుతుందని చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడాలి