విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగా ఎవరి కరెంటు కట్ చేయవద్దని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కోదండరాం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఇటీవల వచ్చిన విద్యుత్ ఛార్జీలను సవరణ చేయాలని వినతి పత్రం సమర్పించారు.
కరెంటు బిల్లుల పెరుగుదల ఆవేదనకు గురిచేస్తోందని కోదండరాం అన్నారు. కరోనా భయంతో లాక్ డౌన్ ఎత్తివేసినా, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోలేదని.. ఎవరి కరెంటు కట్ చేయవద్దని కోరారు. మూడు నెలల బిల్లు సరాసరి చేసేసరికి స్లాబులు మారిపోయాయన్నారు. 100 యూనిట్ల లోపు వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.