తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు అందించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుచ్చి నుంచి చెన్నై చేరుకోనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు స్టాలిన్‌తో భేటీ కానున్నారు. లోక్‌సభ ఫలితాలకు 10 రోజుల గడువు ఉన్న సమయంలో గులాబీ దళపతి పర్యటనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇదీ చూడండి : వీడియోకాన్ కేసులో ఈడీ ముందుకు కొచ్చర్