ఇవీ చూడండి: పాలమూరు-రంగారెడ్డిపై ప్రజాభిప్రాయ సేకరణ
13 వరకు కొనసాగనున్న కేసీఆర్ పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్... కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటన 13 వరకు కొనసాగనుంది. పలు ప్రముఖ ఆలయాలను కుటుంబసమేతంగా సందర్శించనున్నారు సీఎం. ఇవాళ ఆయన తనయుడు కేటీఆర్ కూడా... సతీసమేతంగా కోవలం చేరుకుని తండ్రితో కలిసి దైవ దర్శనం చేసుకోనున్నారు.
దైవ దర్శనం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 13 వరకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సోమవారం కేరళ వెళ్లిన కేసీఆర్...ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. అనంతరం కోవలం చేరుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా సతీసమేతంగా... మంగళవారం కోవలం వెళ్లారు. ఇవాళ కన్యాకుమారికి వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 9న రామేశ్వరం వెళ్తారు. అక్కడి నుంచి కేటీఆర్ తిరిగి హైదరాబాద్ పయనమవుతారని సమాచారం. సీఎం కేసీఆర్ 10న మధుర మీనాక్షి ఆలయం, 11న శ్రీరంగం సందర్శిస్తారు. 12న మహాబలిపురం చేరుకుంటారు. 13న చెన్నైలో బస చేస్తారు. 14న తిరుగు ప్రయాణమవుతారని తెరాస వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: పాలమూరు-రంగారెడ్డిపై ప్రజాభిప్రాయ సేకరణ
Last Updated : May 8, 2019, 8:12 AM IST