లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు.. వారి విజయానికి కారకులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి అభినందించారు. ఎంపీలుగా గెలుపొందిన వారికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెరాస 9 స్థానాల్లో విజయం సాధించగా.. మంత్రులను, అభ్యర్థులను వారు ప్రశంసించారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాల్లో సత్తా చాటారని.. అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములును సీఎం కొనియాడారు. భారీ మెజార్టీతో గెలిచిన పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, నామా నాగేశ్వరరావులను మెచ్చుకున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. కవిత, వినోద్, బూర నర్సయ్యగౌడ్, సాయి కిరణ్, రాజశేఖర్ రెడ్డిలతో మాట్లాడారు. ఓడిపోయినందుకు కుంగిపోకూడదని ఓదార్పునిచ్చారు. కేటీఆర్ సోదరి కవిత ఇంటికి వెళ్లి మాట్లాడినట్లు తెలిసింది.
ఇవీ చూడండి: ఈసారి కారు తగ్గింది... హస్తం, కమలం పెరిగింది