తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ దిల్లీ పర్యటన రద్దైంది. షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్‌కు హస్తినలో అనుమతి లేదని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం దిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలుగు ముఖ్యమంత్రులు హాజరు కావాలనుకున్నప్పటికీ... పౌరవిమానయాన శాఖ నిర్ణయంతో వీరి పర్యటన రద్దైంది. విజయవాడ నుంచి నేరుగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఇవీ చూడండి:మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!