రాష్ట్రంలో ఇళ్లు లేని వాళ్లకు ఇంటి నిర్మాణం చేపడుతామని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత హామీనిచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో తెరాస ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె... కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ ఏడాది రెండు ముఖ్యమైన అంశాలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఒకటి ఇళ్లు, మరొకటి వైద్యం. పసుపుబోర్డు అంశం భాజపా ఎన్నికల ప్రణాళికలో చేర్చుతామని జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. కానీ ఇప్పుడు ఆ అంశం అందులో లేదని మండిపడ్డారు. భాజపా అంటే భారతీయ ఝూఠా పార్టీ అని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే... మేనిఫెస్టో అంశాన్ని చేర్చాలని సవాల్ విసిరారు. ఒకవేళ మీరు చేర్చినా.. చేర్చకపోయినా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మాత్రం ఫెడరల్ ఫ్రంట్ అని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:భారతీయ జనతా పార్టీ 'విజయ సంకల్పం'