పార్లమెంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చట్టం చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన... దేశంలో ఉన్న బీసీలను ఐక్యం చేసేందుకు ఆగస్టు 7న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఓబీసీ జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న వివక్షత, అసమానతలు తొలగించేందుకు ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: జీవితపు అర్థాన్ని నేర్పిన నాన్నే నా హీరో...!