లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాడమాడుతున్న ఇంటర్‌బోర్డు నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. వరంగల్ జిల్లాలోని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్లో భద్రపరిచిన ఇంటర్ ప్రశ్నపత్రాలు గల్లంతయ్యాయి. ఈనెల ఏడోతేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగాల్సి ఉండగా ప్రశ్నాపత్రాలు గల్లంతవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. పోలీస్ స్టేషన్‌కు మొత్తం 13 పెట్టెల్లో ప్రశ్నాపత్రాలు వచ్చాయి. వాటిలో రెండు పెట్టెలు గల్లంతై రెండురోజులు కావొస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తమకు ఎలాంటి సంబంధంలేదని చేతులెత్తేశారు. అయినప్పటికీ సమాచారం బయటకు పొక్కకుండా లోలోపల మాయమైపోయిన పెట్టెలను వెతుకుతున్నారు పోలీసులు, ఇంటర్ అధికారులు.
ఇదీ చదవండి: రీవెరిఫికేషన్‌లోనూ తప్పు జరిగింది: బోర్డు కార్యదర్శి