ETV Bharat / briefs

అంగన్​వాడీల్లో "కామన్" కష్టాలు - icds

అంగన్​వాడీ కేంద్రాల్లో సరికొత్త ప్రయోగానికి మహిళా శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌) శ్రీకారం చుట్టింది. కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ పేరుతో ఇప్పటికే సెల్​ఫోన్లు పంపిణీ చేసింది. అంగన్​వాడీ కేంద్రం పరిధిలోని ప్రతి అంశాన్నీ ఆన్‌లైన్‌లో క్రోడీకరించాలని ఆదేశించింది. " ఇది వరకు ఇచ్చిన సిమ్ కార్డులే పనిచేయటం లేదు... ఇప్పుడు మళ్లీ ఈ ప్రయోగం ఎందుకు..." అంటూ అంగన్​వాడీలు పెదవి విరుస్తున్నారు.

icds-mobile-phones
author img

By

Published : May 5, 2019, 9:22 AM IST

పూర్వ, ప్రాథమిక దశలో పిల్లలకు చదువు చెప్పడంలో ఆమె ఓ ఉపాధ్యాయురాలు. చిన్నారులకు టీకాలు వేసిన నర్సు. ఎన్నికల సమయంలో పోలింగ్‌ కేంద్రం నిర్వహకురాలు. దస్త్రావేజులు రాయడంలో ఓ రికార్డు అసిస్టెంటు. అన్ని పనులూ చేసినా కనీస గుర్తింపునకు నోచుకోని ఆమె మరెవరో కాదు అంగన్​వాడీ ఉపాధ్యాయురాలు.! ప్రభుత్వ ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లటంలో ఆమె పాత్ర ఎంతో కీలకం. క్షేత్రస్థాయిలో ఏదైనా పొరపాటు జరిగితే... మూల్యం చెల్లించుకోవాల్సిందీ ఆమె!

సరికొత్త ప్రయోగానికి శ్రీకారం...

గతంలో అంగన్​వాడీ ఉపాధ్యాయులందరికీ సిమ్‌ కార్డులు పంపిణీ చేశారు. తరువాత ఏమైందో తెలియదు కానీ... వాటి నిర్వహణను అర్ధాంతరంగా నిలిపివేసింది. తాజాగా కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ (CAS) పేరిట ప్రతీ అంగన్​వాడీ ఉపాధ్యాయురాలికి సెల్‌ఫోన్‌ పంపిణీ చేసి ఆయా కేంద్రం పరిధిలోని ప్రతీ అంశాన్ని ఆన్‌లైన్‌లో క్రోడీకరించాలని ఆదేశించింది. పాత పద్ధతిలోనైతే 14 రిజిష్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది. తాజాగా వీటన్నింటినీ క్రోడీకరిస్తూ... ఎనిమిది విభాగాలతో కూడిన స్మార్ట్‌ఫోన్లను తొలివిడతగా పాత ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో దాదాపుగా 35,700 అంగన్​వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిన్నింటిలో ఈ ప్రయోగాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.

"కామన్"పై భిన్న స్వరాలు...

రూ. 7 వేలు ఉన్న అంగన్​వాడీ ఉపాధ్యాయుల వేతనాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం రూ. 10,500 చేసింది. వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సరిసమానంగా విధుల నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. తాజాగా పోలింగ్‌ బూత్ నిర్వహకురాలు(బీఎల్‌ఓ) బాధ్యతలను సైతం అప్పగించింది. టీచర్ల కంటే ఓ రెండు పనులు ఎక్కువగానే చేయించుకునే అంగన్​వాడీలకు వేతనం మాత్రం అరకొరగానే ఇస్తోంది. పైగా ఏ చిన్న తప్పు జరిగినా వారినే నిందించడం పట్ల అసహనం వ్యక్తమవుతోంది. "కామన్"తో తమపై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదముదని అంగన్​వాడీలు అభిప్రాయ పడుతున్నారు. ముందుగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, తర్వాత ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని వారు కోరుతున్నారు.

" రియల్ టైం ప్రాజెక్టు కింద ఎనిమిది అంశాలను కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో చేర్చాం. వీటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొంతమందిని ప్రత్యేకంగా గుర్తించాం. వారికి శిక్షణ ఇస్తున్నాం."

- మిల్క, ప్రాజెక్టు డైరెక్టర్‌, మహిళా శిశు సంక్షేమశాఖ

మారుతున్న కాలానికి అనుగుణంగా అంగన్​వాడీల్లోనూ మార్పులు తేవాలి అనుకోవడం మంచి పరిణామమే... అయితే... క్షేత్రస్థాయిలో పనిభారం పెంచడంపై మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఐసీడీఎస్​లో "కామన్"కు శ్రీకారం

ఇదీ చదవండి: అంగన్​వాడీ టీచర్లకు ఓటు హక్కుపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.