ETV Bharat / briefs

రవిప్రకాశ్​కు ముందస్తు బెయిల్​ నిరాకరణ

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్​కి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏబీసీఎల్​ సంస్థ యాజమాన్యం విషయంలో ఫోర్జరీకి పాల్పడ్డాడని అలంద మీడియా తనపై పెట్టిన కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో మే20న పిటిషన్​ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని చేసిన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం కోట్టేసింది.

అభ్యర్థన తొసిపుచ్చిన హైకోర్టు
author img

By

Published : May 22, 2019, 7:58 PM IST

Updated : May 22, 2019, 10:44 PM IST

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్​ని ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. రవిప్రకాశ్‌ కేసు విషయంలో సీఆర్‌పీసీ 41 ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. సైబరాబాద్‌, బంజారాహిల్స్‌ పోలీస్​స్టేషన్​లలో తనపై నమోదైన 3 కేసులు కొట్టివేయాలని మే 20న రవిప్రకాశ్​ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రవిప్రకాశ్​కు ముందస్తు బెయిల్​ నిరాకరణ

వీడియోతో సందేశం...

ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్​ ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9 కోసం ఎంతో కష్టపడి దేశంలోనే నెంబర్ వన్ ఛానల్ చేశామని... అలాంటి తనను చట్టరిత్యా ఏరకమైనా ఒప్పందం చేసుకోకుండా.. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రవి ప్రకాశ్ ఆరోపించారు.

అలంద మీడియా ఫిర్యాదు చేసిన ఫోర్జరీ కేసుల విషయంలో పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా... రవిప్రకాశ్​ విచారణకు హాజరు కాని విషయం తెలిసిందే. ముందుస్తు బెయిల్‌ కోసం రవిప్రకాశ్​ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇంతకు మునుపే ఓసారి తోసిపుచ్చిన న్యాయస్థానం ఈ సారి కూడా కొట్టేసింది.

ఇవీ చూడండి: ముందస్తు బెయిలిస్తే సహకరిస్తా: రవిప్రకాశ్​

Last Updated : May 22, 2019, 10:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.