ఈరోజుల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సోషల్ మీడియా జపం చేస్తున్నవారే. సెల్ఫీ దిగడం, స్టేటస్ పెట్టేయడం, వీడియో తీయడం-వైరల్ చేసేయడం అలవాటుగా మారింది. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలూ అంతే. తమ చిత్రాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఇదొక వేదికైంది. ప్రస్తుతం దర్శకనిర్మాతలు, నటీనటులు సామాజిక మాధ్యమాలతోనే అభిమానులకు దగ్గరవుతున్నారు. అలాంటిది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇప్పటికీ ఈ మీడియాను ఉపయోగించడు.
తాజాగా 'అల వైకుంఠపుములో' చిత్ర ప్రచార కార్యక్రమానికి హాజరైన త్రివిక్రమ్‌ను ఓ విలేకరి ఇదే ప్రశ్న అడగ్గా స్పందించాడీ మాటల మాంత్రికుడు. "రెండు కారణాల వల్ల నేను సోషల్ మీడియా వాడను. మొదటిది నాకు వాడటం రాదు. రెండు బద్ధకం. నా ఫోన్ ఎక్కడుంటుందో నాకే తెలీదు. అయినా ఈ వయసులో నాకు దాంతో పనేం ఉంది" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్.
-
#Trivikram About Social Media. At #AlaVaikunthapurramloo meet. #AlluArjun #TrivikramSrinivas #TrivikramCelluloid #AlaVaikunthapurramuloo pic.twitter.com/EH43SoeNcn
— Sitara Cinema (@SitaraCinema) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Trivikram About Social Media. At #AlaVaikunthapurramloo meet. #AlluArjun #TrivikramSrinivas #TrivikramCelluloid #AlaVaikunthapurramuloo pic.twitter.com/EH43SoeNcn
— Sitara Cinema (@SitaraCinema) January 12, 2020#Trivikram About Social Media. At #AlaVaikunthapurramloo meet. #AlluArjun #TrivikramSrinivas #TrivikramCelluloid #AlaVaikunthapurramuloo pic.twitter.com/EH43SoeNcn
— Sitara Cinema (@SitaraCinema) January 12, 2020
మనకు తెలియని ఎన్నో మాటల్ని ఎలా వాడాలో, పొదుపుగా ఎలా మాట్లాడాలో తెలిసిన త్రివిక్రమ్‌కు సోషల్ మీడియా వాడటం రాకపోవడమేంటి, తన మాటల్తో స్ఫూర్తి నింపే అతడికి బద్ధకం ఏంటి? అనిపిస్తుంది కదా! ఇందుకే అభిమానులు ఈ దర్శకుడిని మాటల మాంత్రికుడు అంటారు.
ఇవీ చూడండి.. 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం చెర్రీ ఇంత కష్టపడుతున్నాడా..!