రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి బయటకురావాలంటేనే జనం జంకుతున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శినమిస్తున్నాయి. చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
జూన్ మొదటి వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
ఇవీ చూడండి: తెరాసకు 12 నుంచి 16 స్థానాలు: ఎగ్జిట్ పోల్స్