రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవరణలో చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారస్థులకు నిత్యావసర సరకులు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటింటికీ వెళ్లి సరకులు, దుస్తులు అందజేశారు.
లాక్డౌన్ వల్ల చిలుకూరు బాలాజీ దేవాలయం మీద ఆధారపడ్డ ఎంతో మంది చిరు వ్యాపారులు తీవ్ర నష్టాల పాలయ్యారని రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ... అందరూ జాగ్రత్తగా ఉండి కరోనాను దూరం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.