ETV Bharat / briefs

జీహెచ్​ఎంసీ అధికారుల ఆకస్మిక పర్యటన - జీహెచ్​ఎంసీ అధికారుల ఆకస్మిక పర్యవేక్షణ

జీహెచ్​ఎంసీ ఫరిదిలో వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా... అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ... పనులను పరిశీలించారు. ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి నోటీసులు జారీచేశారు.

ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Jun 14, 2019, 3:11 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలో పురపాలనశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ అరవింద్, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ పర్యటించారు. చార్మినార్​ లాడ్​ బజార్​ నుంచి ముర్గి చౌక్​ క్లాక్​ టవర్​, కిల్వత్​ మీదుగా జరిగే రోడ్​ వెడల్పు పనులను పర్యవేక్షించారు. అంతకు ముందు రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని భౌంరుక్ దౌల చెరువు ఆక్రమణకు గురవుతుందన్న ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీ చేశారు. పర్యటనలో హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ, సౌత్​ జోన్​ కమిషనర్ హరిచందన, జిల్లా కలెక్టర్ లోకేష్​కుమార్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్​లోని రాఘవేంద్ర కాలనీలో 25 ప్లాట్లు, ఇళ్లు ఎఫ్​టీఎల్​లో ఉన్నాయని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. గతంలో ఇళ్ల నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు, హెచ్ఎండీఏ అధికారులు అనుమతులు ఇచ్చారని కాలనీవాసులు తెలిపారు. ఇప్పటివరకు అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు.

ఆకస్మిక తనిఖీలు

ఇవీ చూడండి: సర్కార్​ బడుల్లో చదువుల పండుగ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.