ETV Bharat / briefs

మందుచుక్క దొరక్క ఇద్దరు వృద్ధుల ఆత్మహత్య - lockdown difficulties

కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్​డౌన్​తో దక్షిణాది రాష్ట్రాల్లో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. మద్యం దొరకడం లేదని కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వృద్ధులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Frustrated at not being able to get liquor, two people commit suicide in Karnataka
మందుచుక్క దొరక్కా... ఇద్దరు వృద్ధులు ఆత్మహత్య
author img

By

Published : Aug 12, 2020, 4:52 PM IST

లాక్​డౌన్​ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మద్యం దుకాణాలన్నీ మూసి ఉండటం వల్ల మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా మద్యం దొరక్క ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు.

దక్షిణ కన్నడ జిల్లాలోని కుట్రుపాడి గ్రామానికి చెందిన టామీ థామస్​(50) రబ్బర్ తోటలో కూలీగా చేసేవాడు. అయితే మద్యం లభించడం లేదని మనస్తాపానికి గురై ఇంట్లోనే​ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అదే జిల్లా కొడిమ్​బాలా గ్రామానికి చెందిన మరో వృద్ధుడు థామస్​(70) మందు దొరక్క ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కేరళ, తెలంగాణలో 50 ఏళ్ల వృద్ధులు ఇలానే ఆత్మహత్య చేసుకున్నారు.

ఇదీ చూడండి : 'జీవన్మరణ పోరాటంలో విజయం తథ్యం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.