సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఏరువాక పౌర్ణమిని రైతులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎద్దులను కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి అరకలతో సహా గ్రామంలో ఊరేగించారు. గణపతికి ఉండ్రాళ్ళు సమర్పించి పనిముట్లకు... భూదేవికి ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండి ప్రజానికం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనావాయితీగా వస్తున్న ఈ ఆచారాన్ని స్థానికులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
ఇవీ చూడండి: అది నిజంగా పోలీస్ స్టేషనే..!