ETV Bharat / briefs

నేటి నుంచి రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం - pharma

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి నుంచి ఎంసెట్ ఆన్​లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ, రేపు, ఈనెల 6న ఇంజినీరింగ్.... 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో ఎంసెట్ జరగనుంది. రెండు విభాగాల్లో కలిపి సుమారు 2 లక్షల 17 వేల మంది పరీక్షలు రాయనున్నారు.

ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
author img

By

Published : May 3, 2019, 5:21 AM IST

Updated : May 3, 2019, 7:52 AM IST

ఎంసెట్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి ఈనెల 9 వరకు రోజుకు రెండు పూటలు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు... రెండో పరీక్ష మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇవాళ, రేపు, ఈనెల 8న ఇంజినీరింగ్ కోర్సుల కోసం ఎంసెట్ జరగనుంది. ఇంజినీరింగ్ కోసం లక్షా 43వేల మంది విద్యార్థులు ఎంసెట్ రాయనున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో జరగనున్న ఫార్మా, అగ్రికల్చర్ విభాగంలో సుమారు 75వేల మంది విద్యార్థులు ఎంసెట్​కు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్​లైన్ ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో 15 పట్టణాల్లో 84... ఏపీలో మూడు పట్టణాల్లో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఒక్క నిమిషం నిబంధన..!

విద్యార్థులు వీలైనంత త్వరగా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గంటన్నర ముందు నుంచే విద్యార్థులను లోపలికి పంపిస్తామని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. అనుమతించే లేదని స్పష్టం చేస్తున్నారు. క్యాలిక్యులేటర్లు, సెల్​ఫోన్లు, గడియారం వంటి వస్తువులేవి కేంద్రాల్లోనికి అనుమతించరు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రం వెంట తీసుకెళ్లాలి. విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని... ఏ సమస్య తలెత్తినా.. ఇన్విజిలేటర్లను సంప్రదించి పరిష్కరించుకోవచ్చవని... ఎంసెట్ కన్వీనర్ యాదయ్య సూచించారు.

ఈనెలాఖరున ఫలితాలు...

ఎంసెట్ ఫలితాలను ఈనెలాఖరున విడుదల చేయాలని అధికారులను భావిస్తున్నారు. ఈనెల 9న పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇంటర్ రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక... కొత్త మార్కులనే వెయిటేజీ కోసం పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు

Intro:Body:Conclusion:
Last Updated : May 3, 2019, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.