షెడ్యూల్ ఇదిగో...
గడువు | ప్రక్రియ |
24 నుంచి జులై1 | ప్రాథమిక సమాచారం పూర్తి చేయటం, ప్రాసెసింగ్ రుసుం చెల్లించటం, ధ్రువపత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాన్ని, తేదీని, సమయాన్ని ఎంపికచేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవటం |
27 నుంచి జులై 3 | ధ్రువ పత్రాల పరిశీలన |
27 నుంచి జులై 4 | కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్లు ఇచ్చుకోవటం |
జులై 6న | సీట్ల కేటాయింపు |
జులై 6 నుంచి 12 | వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ రుసుం చెల్లించటం |
అంతా మీ ఇష్టమే...!
గతేడాది వరకు ఏ ర్యాంకు వారు ఏ రోజు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలో అధికారులే నిర్ణయించేవారు. ఈసారి మాత్రం పాలిసెట్‌లో అమలు చేసిన స్లాట్ బుకింగ్ విధానాన్నే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లోనూ ప్రవేశపెట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఏ రోజు, ఏ కేంద్రానికి, ఏ సమయంలో వెళ్తారో ముందుగానే వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతీ రెండు గంటలకు ఒక స్లాట్ ఉంటుంది. దాంతో ఒక విద్యార్థికి ధ్రువపత్రాల పరిశీలన 2 గంటలకు మించి పట్టదని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: వైభవంగా... కాళేశ్వర గంగ ఉప్పొంగంగా...!