ETV Bharat / briefs

ఆన్​లైన్​లోనూ 'కరోనా' వైరస్​.. అవి తెరిస్తే అంతే!

మిమ్మల్ని ఇట్టే ఆకర్షించే ఈ-మెయిళ్లు ఏమైనా వస్తున్నాయా? ముఖ్యంగా కరోనా గురించి. 'కరోనా వ్యాప్తిపై భయపడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి' అని ఇలా ఏమైనా సందేశాలు వస్తున్నాయా? అయితే తప్పక భయపడాల్సిందే. ఒక్కసారి దానిని క్లిక్​ చేస్తే.. తర్వాత ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా ఒకే ఒక్క స్పాం మెయిల్​తో విలువైన సమాచారం తస్కరిస్తున్నారు సైబర్​ నేరగాళ్లు. కరోనాను అక్రమాలకు ఎరగా మలుచుకుంటున్నారు. ఈ దోపిడీ ఎలా చేస్తున్నారు..? ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి మరి..!

Cybercriminals Are Using Coronavirus to Spread Emotet Trojan Virus
ఆన్​లైన్​లోనూ 'కరోనా' వైరస్​.. అవి తెరిస్తే అంతే!
author img

By

Published : Feb 14, 2020, 7:42 AM IST

Updated : Mar 1, 2020, 7:09 AM IST

ఎమోటెట్​ ట్రోజన్​ వైరస్​.. సైబర్​ నేరాల్లో ఒకటైన ఈ వైరస్​ ఎంతో ప్రమాదకరం. ఎక్కువగా స్పాం మెయిళ్ల ద్వారా యూజర్లను బుట్టలో వేసుకుంటారు నేరగాళ్లు. ఒక్కసారి క్లిక్​ చేస్తే ఇక అంతే. తర్వాత బాధ పడడం తప్ప ఇంకేం చేయలేం. మన ఆర్థిక, వ్యక్తిగత, బ్యాంకింగ్​ సమాచారమంతా క్షణాల్లో సైబర్​ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లే. ఇప్పుడు దీని గురించి ఎందుకు అనుకుంటున్నారా?

సైబర్​ క్రిమినల్స్ దీనిని విస్తృతంగా ప్రయోగిస్తున్నారు మరి​. ఓ వైపు కరోనా వైరస్​ ప్రపంచ దేశాలను వణికిస్తోంటే.. ఇదే అదనుగా విరుచుకుపడుతున్నారు. ట్రోజన్​ వైరస్​ను స్పాం మెయిళ్ల ద్వారా కంప్యూటర్లలోకి పంపించి.. విలువైన, సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఐబీఎం-ఎక్స్​ ఫోర్స్​ పరిశోధనలో ఈ గుట్టు బయటపడింది.

మొత్తం కరోనా చుట్టూనే...

కరోనా వైరస్​ను కేంద్రంగా చేసుకునే.. ఈ చర్యకు పాల్పడుతున్నారు సైబర్​ నేరగాళ్లు. వైరస్​ సంక్రమణ, నివారణ చర్యలంటూ మోసపూరిత మెయిళ్లు పంపుతున్నట్లు ఐబీఎం ఎక్స్​-ఫోర్స్​ గమనించింది. అయితే.. ఎక్కువగా జపాన్​ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నట్లు సమాచారం.

ఎమోటెట్​ అనేది ఒక ట్రోజన్​ వైరస్​. కంటెంట్‌ ఆకర్షించే విధంగా వినియోగదారులను ఒక నిర్దిష్ట వెబ్ పేజీ లింక్‌పై క్లిక్ చేయమని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. బ్రౌజింగ్​ ద్వారా సున్నితమైన సమాచారాన్ని సేకరించడం ఎమోటెట్​ ప్రధాన విధి.

ఎలా చేరుతుంది..?

ఇది స్పాం మెయిళ్ల ద్వారా వ్యాపిస్తుంది. అయితే.. ఈ వ్యాప్తి ఏ విధంగానైనా జరగొచ్చు. హానికర స్క్రిప్ట్​, డాక్యుమెంట్​ ఫైళ్లు, ఏదైనా లింక్​ల ద్వారా కంప్యూటర్​లోకి ప్రవేశిస్తుంది. ఇది దాదాపు అన్ని మెయిళ్లలానే కనిపించి మన కళ్లనే మోసం చేస్తుంది.

ఒక్కసారి ట్రోజన్​ వైరస్ మీ కంప్యూటర్​లోకి చేరితే.. ఆర్థిక, బ్యాంకింగ్​ వివరాల్ని సేకరిస్తుంది. ఆ సమాచారం అంతటినీ కేటుగాళ్లకు చేరవేస్తుంది.

ఆ ప్రాంతాలే లక్ష్యం..

ఇలాంటి మెయిళ్లలో ఎక్కువభాగం జపనీస్​ భాషలోనే ఉంటున్నాయి. దీనిని బట్టి.. ఆపరేటర్లు ఉద్దేశపూర్వకంగా వ్యాధి వ్యాప్తి చెందే ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మెయిళ్లను ఇట్టే ఆకర్షించేలా రూపొందిస్తారు నేరగాళ్లు. ఇలా చేయడం ద్వారా మరో క్షణం ఆలోచించకుండానే ఆ మెయిల్​ను తెరిచేందుకు ఆస్కారం ఉంటుంది.

ఉదాహరణకు ఒక మెయిల్​ను ప్రస్తావించింది ఐబీఎం-ఎక్స్​ ఫోర్స్​. జపాన్​ భాష నుంచి అనువదించి మెయిల్​లోని విషయాలను పేర్కొంది.

ఈ మెయిల్​ను చూస్తే.. జపాన్​లోని ఓ డిసబులిటీ వెల్ఫేర్​ సర్వీస్​ ప్రొవైడర్ దీనిని పంపినట్లుగా కనిపిస్తోంది. ​కరోనా వైరస్​ బాధితులు జపాన్​లోని గిఫు ప్రిఫెక్చర్​ వద్ద సంప్రదించాల్సిందిగా ఆ మెయిల్​లో పేర్కొన్నారు. కొన్ని డాక్యుమెంట్లను అటాచ్​ చేసి పంపారు.

ఇవి తెరిస్తే అంతే సంగతులు. విలువైన సమాచారమంతా మాయం.

ఇవే అస్త్రాలు..

  • ఇతర ప్రాంతాల్లో వైరస్​ వ్యాప్తిపై ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం
  • వాస్తవ మెయిళ్లను పోలి ఉండేలా చూసుకోవడం
  • సంబంధిత ప్రజారోగ్య అధికారి ఫ్యాక్స్​, ఫోన్​ నెంబర్​, ఈ మెయిల్​ చిరునామాను ప్రస్తావించడం

ఇతర ఎమోటెట్ సైబర్​​ దాడుల్లానే.. డాక్యుమెంట్​పై ఎనాబుల్​ ద కంటెంట్​ అనే ఎంపికను ఎంచుకోగానే వై​రస్​ కంప్యూటర్లోకి ప్రవేశిస్తుంది. యూజర్లకు తెలియకుండానే మరొకవైపు ఎమోటెట్​ డౌన్​లోడ్​ అవుతుంది.

గత కొద్దివారాలుగా పరిశీలించిన చాలా మెయిళ్లలోనూ సైబర్​ నేరగాళ్లు ఇదే పద్ధతి పాటిస్తున్నట్లు గమనించింది ఐబీఎం.

రంగంలోకి కాస్పర్​స్కై...

అయితే.. ఈ స్పాంలను అరికట్టడానికి నడుం బిగించింది కాస్పర్​స్కై యాంటీ వైరస్​. దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. సంబంధిత డాక్యుమెంట్లు పీడీఎఫ్​, ఎంపీ4, డాక్​ ఫైళ్లలా ఉంటాయని.. ఇవి యూజర్ల సమాచారాన్ని మార్చడం, నిషేధం, ధ్వంసం, సేకరించడం, తస్కరించేందుకు ఆస్కారం ఉంటుందని వివరిస్తున్నారు.

''కరోనా వైరస్​ వ్యాప్తిపై ప్రజలు ఇంకా తమ ఆరోగ్యం గురించి భయపడుతున్నట్లయితే.. నకిలీ డాక్యుమెంట్ల వెనుక దాగున్న మాల్​వేర్​లను మనం మరెన్నో చూడవచ్చు. ''

- ఆంటోన్​ ఇవనోవ్​, కాస్పర్​స్కై మాల్వేర్​ అనలిస్ట్​

కరోనా వైరస్​ వ్యాప్తి కొనసాగినంత కాలం... ప్రపంచానికి పెను ప్రమాదమే. ఎక్కువగా ప్రజల్లో తమ ఆరోగ్యంపై భయం పుట్టుకొస్తుంది. అలాంటప్పుడే సమాచారాన్ని తెలుసుకోవాలని ఆత్రుతతో ఇలాంటి మెయిళ్లను ఓపెన్​ చేయకుండా ఉండలేరు.

కంప్యూటర్​ వైరస్​ను ప్రపంచవ్యాప్తం చేయడానికి సైబర్​ నేరగాళ్లు ఈ ఆరోగ్య విపత్తును ఒక అవకాశంగా మలుచుకోవచ్చని అంచనా వేశారు పరిశోధకులు.

ఇదీ చూడండి: కనిపించని శత్రువుతో సమరం-అంతర్జాలం

Last Updated : Mar 1, 2020, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.