రాయితీ విత్తనాల వ్యాపారం పేరుతో ఓ వైద్యుడికి ఏకంగా రూ.కోటి నలభై లక్షల కుచ్చుటోపి పెట్టారు ఇద్దరు మోసగాళ్లు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గుండె వ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్న వైద్యుడి వద్దకు జూబ్లీహిల్స్‌కి చెందిన పట్టాభి, పాండా వైద్యం కోసం వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల వైద్యుడితో స్నేహం పెంచుకున్నారు. రాయితీ విత్తనాల వ్యాపారం చేస్తున్నట్లుగా వైద్యుడిని నమ్మించారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ సంస్థ నుంచి రాయితీ విత్తనాలు కొని పశ్చిమ బంగ ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నామని ఒప్పంద పత్రాలు చూపించారు. పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరారు. నిందితుల మాటలు నమ్మిన వైద్యుడు రెండేళ్ల క్రితం వీరి ఖాతాకు కోటి నలభై లక్షల రూపాయలు బదిలీ చేశాడు.
ఆరా తీస్తే బయటపడ్డ అసలు విషయం...
నెలలు గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోయేసరికి 2017లో సదరు వైద్యుడు పట్టాభి, పాండాలను నిలదీశాడు. కొంత సమయం అడిగినా... గడువు లోపల డబ్బు ఇవ్వకపోవటం వల్ల అనుమానం వచ్చిన వైద్యుడు వ్యాపార ఒప్పంద పత్రాలపై ఆరా తీశాడు. నకిలీవని తేలంటం వల్ల మోసపోయినట్లు నిర్ధారించుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పట్టాభి, పాండాతో పాటు... నగదు బదిలీ చేయించిన చామర్తి, భావన, అజయ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి: 1.12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగే లక్ష్యంగా