జిల్లా కలెక్టర్ అనే పేరు ఇక తెరమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శిస్తు వసూళ్లకు అనుగుణంగా రెవెన్యూ పేరుతో ఏర్పడిన రెవెన్యూ శాఖ, తహసీళ్లను పాలించిన తహసీల్దార్ల వ్యవస్థల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మార్పుల్లో జిల్లా కలెక్టర్ పేరు జిల్లా పాలనాధికారిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆదాయం వసూలు చేసే విధుల నుంచి భూ, సాధారణ పరిపాలన సేవలకు అనుగుణంగా మార్పులకు లోనైన రెవెన్యూ శాఖ మున్ముందు సాధారణ పరిపాలన శాఖగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న మహబూబాబాద్ ప్రచార సభలోనూ కేసీఆర్ దీనిపై స్పష్టత ఇచ్చారు.
భూ దస్త్రాల ప్రక్షాళన అమలు, ధరణి పోర్టల్ ఏర్పాటు సంస్కరణలు చేపట్టిన సర్కారు కొద్దిరోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల తరువాత దీనిపై స్పష్టత రానుంది.
ఇవీ చూడండి: 'కేంద్రంలో తెరాస నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది'