ETV Bharat / briefs

పుల్వామా సూత్రధారి 'వీడే'! - జైషే మహమ్మద్

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదాసిర్ అహ్మద్​ఖాన్ అని నిర్థరించారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. ఇతనితోపాటు దక్షిణ కశ్మీర్లో​ బిజ్​బెహారా ప్రాంతానికి చెందిన సజ్జత్​ భట్​.. ప్రస్తుతం జైషే మహమ్మద్ ఉగ్రకార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నట్లు భావిస్తున్నారు.

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి 'ముదాసిర్ అహ్మద్​ఖాన్'
author img

By

Published : Mar 10, 2019, 6:30 PM IST

Updated : Mar 10, 2019, 6:39 PM IST

పుల్వామా ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాది 'ముదాసిర్ అహ్మద్​ఖాన్​' ఆలియాల్​ 'మోహ్ద్​ భాయ్​' అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు తెలిపారు.

పుల్వామా జిల్లా త్రాల్​లోని మీర్​ మొహల్లాకు చెందిన 23 ఏళ్ల ముదాసిర్​ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తుండేవాడు.
కశ్మీర్​లోయలో ఉగ్రవాద చర్యలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న నూర్​ మహ్మద్​ తంత్రే (నూర్​ త్రాలీ) ఆధ్వర్యంలో ముదాసిర్ 2017 సంవత్సరంలో​ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో చేరాడు. తాంత్రే మరణించిన తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయిన ముదాసిర్​, 2018 జనవరి 14 నుంచి ఉగ్రకార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడని అధికారులు తెలిపారు.

ఇలా పథకం వేశారు...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ జరిపిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవానులు మరణించారు. ఈ దాడికి పథక రచన చేసిన ముష్కరుడు ముదాసిరే. జవాన్ల వాహనాలపై ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ అహ్మద్​తో ముదాసిర్​ తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. దాడికి వాడిన వాహనాన్ని, పేలుడు పదార్థాలను ముదాసిరే సమకూర్చాడు. దాడికి కేవలం 10 రోజుల ముందే మారుతీ ఎకో మినీవ్యాన్​ను కొన్నాడని అధికారులు తెలిపారు.

వీడొక రక్తపిశాచి

ముదాసిర్ ఇప్పటికే పలు దాడుల్లో కీలకపాత్ర వహించాడని అధికారులు చెబుతున్నారు. 2018 జనవరిలో లేత్​పొరాలో సీఆర్​పీఎఫ్​ శిబిరంపై దాడిలో ముదాసిర్ పాల్గొన్నాడు. ఆ దాడిలో 5గురు సీఆర్పీఎఫ్​ జవానులు మరణించారు. అలాగే ఫిబ్రవరి 2018లో సుజవాన్​ సైనిక శిబిరంపై చేసిన దాడిలో కూడా ముదాసిర్​ కీలకపాత్ర వహించాడు. ఆ దాడిలో 6 మంది సైనికులతోపాటు, ఒక స్థానికుడు మరణించారు.

ఎన్​ఐఏ దర్యాప్తు

పుల్వామా దాడిపై విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫిబ్రవరి 27న ఈ కరుడుగట్టిన ఉగ్రవాది ముదాసిర్​ నివాసంలో సోదాలు జరిపింది. ప్రస్తుతం దక్షిణ కశ్మీర్లో​ బిజ్​బెహారా ప్రాంతానికి చెంది సజ్జత్​ భట్​ జైషే మహమ్మద్ ఉగ్రకార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 10, 2019, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.