భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 8న ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి రానున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ముందుగా అనుకున్న ప్రకారం 6న హైదరాబాద్, నల్గొండ రోడ్‌షోల్లో పాల్గొనాల్సి ఉంది. సమయాభావం కారణంగా వాటిని రద్దు చేసినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. అమిత్ షా తన ప్రసంగంతో శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని... మరోసారి భాజపా అధికారంలోకి తెచ్చేందుకు బూత్ స్థాయి నుంచి అందరూ కృషి చేయాలని కోరారు.
ఇవీ చూడండి: వికారి ఆగమనం.. సంతోషాలకు శుభారంభం..