ETV Bharat / briefs

పక్షి ప్రాణాలు కాపాడటంలో ధోనీకి సాయపడ్డ జీవా - copersmith brid saved by ms dhoni

గాయపడిన ఓ పక్షిని తన తల్లిదండ్రులు రక్షించారని చెప్పిన ధోనీ కుమార్తె జీవా.. ఆ ఫొటోల్ని పంచుకుంది. వీటిని చూసిన అభిమానులు వాటికి తెగ లైకులు కొడుతున్నారు.

MS Dhoni
పక్షి ప్రాణాలు కాపాడిన ధోని.. ఇన్​స్టాలో కుమార్తె పోస్ట్​
author img

By

Published : Jun 10, 2020, 2:02 PM IST

Updated : Jun 10, 2020, 2:45 PM IST

లాక్​డౌన్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ.. తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి సంబంధించిన విషయాల్ని, భార్య సాక్షి సింగ్ పోస్ట్ చేస్తునే ఉంది. ఈ క్రమంలోనే మహీ కుమార్తె జీవా ఇన్​స్టాలో పంచుకున్న ఓ ఫొటో..​ నెటిజెన్లను హత్తుకుంటోంది. గాయపడిన ఓ పక్షిని తన తల్లిదండ్రులు కాపాడారని, చెబుతూ ఆ చిత్రాన్ని పోస్ట్ చేసింది.

"ఈ రోజు సాయంత్రం గార్డెన్​లో ఓ పక్షి అపస్మారక స్థితిలో ఉన్నట్లు చూశా. వెంటనే అమ్మా, నాన్న పిలిచా. నాన్న వచ్చి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని నీరు తాగించారు. కొంతసేపటి తర్వాత పక్షి కళ్లు తెరిచింది. మాకు ఎంతో సంతోషం వేసింది. పక్షిని బుట్టపైన అమర్చిన ఆకులో ఉంచాం. దీన్ని 'క్రిమ్సన్​-బ్రెస్ట్​ బార్బెట్​' అని పిలుస్తారని అమ్మ చెప్పింది. 'కాపర్​స్మిత్'​ అని కూడా అంటారట. ఎంతో అందంగా ఉందో చూడండి ఈ బుజ్జి పక్షి"

--జీవా, ధోని కుమార్తె

లాక్​డౌన్​ సమయంలో అన్ని రకాలు క్రీడలూ నిలిచిపోయాయి. ఐపీఎల్​ 13వ సీజన్​ను నిరవధిక వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్​ ఆటగాళ్లంతా సామాజిక మాధ్యమాల్లో ముచ్చట్లు పెడుతూ అభిమానులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, ధోనీ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తన భార్య సాక్షి, కుమార్తె జీవా ఇన్​స్టా పోస్టుల్లో మాత్రమే కనిపిస్తున్నాడు.

MS Dhoni
ధోని కుమార్తె జీవా

ఇదీ చూడంండి:

Last Updated : Jun 10, 2020, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.