మిగతా దేశాల కన్నా క్రికెట్ అంటే భారత్లో క్రేజ్ ఎక్కువ. మరో రెండు నెలల్లో ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే విరాట్సేనకు మద్దతుగా.. 22 దేశాల్లోని అభిమానులు ఒక్క చోటుకు చేరనున్నారు. దాదాపు 8,000 మంది 'భారత్ ఆర్మీ'గా ఏర్పడి విరాట్సేనకు మద్దతు తెలపనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది.
Bharat Army promises special atmosphere at CWC19 via @ICC https://t.co/vsuuoFzZfZ
— The Bharat Army (@thebharatarmy) March 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bharat Army promises special atmosphere at CWC19 via @ICC https://t.co/vsuuoFzZfZ
— The Bharat Army (@thebharatarmy) March 21, 2019Bharat Army promises special atmosphere at CWC19 via @ICC https://t.co/vsuuoFzZfZ
— The Bharat Army (@thebharatarmy) March 21, 2019
1999 ప్రపంచకప్ సమయంలో నలుగురుతో ప్రారంభమైందీ 'భారత్ ఆర్మీ'. 2015 నుంచి ఇతర దేశాలకు వెళ్లి మరీ టీమిండియాకు మద్దతు తెలుపుతోంది. ఈ సంఖ్యను ప్రస్తుతం పెంచేందుకు వారు కృషి చేస్తున్నారు.
ఈ ప్రపంచకప్లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్కు 5వేల నుంచి 6వేల మంది వరకు హాజరుకానున్నారు. యూకేలో ప్రారంభమైన ఈ సంఘం... ప్రాంతాల వారీగా ప్రతినిధులను నియమించి, ప్రపంచం మొత్తం విస్తరిస్తోందని 'భారత్ ఆర్మీ' స్థాపకుల్లో ఒకరైన రాకేశ్ పటేల్ తెలిపారు.
ప్రాంతీయ ఇన్ఛార్జ్లు... భారత్, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో మా మద్దతుదార్లను పెంచుతున్నారు. 1990లో తొలి మ్యాచ్ చూశాను. 30 ఏళ్లుగా భారత్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా అక్కడకెళ్లి చూస్తాను. అక్కడి నుంచి సచిన్ చివరి మ్యాచ్ వరకు ప్రతిదీ వీక్షించాను. -రాకేశ్ పటేల్, భారత్ ఆర్మీ స్థాపకుల్లో ఒకరు.
ఇవీ చదవండి: