ETV Bharat / briefs

అట్లాస్‌ సైకిల్స్‌ అధినేత భార్య ఆత్మహత్య

author img

By

Published : Jan 23, 2020, 11:49 AM IST

Updated : Feb 18, 2020, 2:26 AM IST

అట్లాస్​ సైకిల్స్​​ తయారీ సంస్థ అధినేత సంజయ్​ కపూర్​ భార్య.. నటాషా కపూర్​ ఆత్యహత్య చేసుకున్నారు. దిల్లీలోని తన నివాసంలో సీలింగ్​ ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణం చెందారు.

Atlas Cycles
అట్లాస్‌ సైకిల్స్‌ అధినేత భార్య ఆత్మహత్య

ప్రముఖ సైకిల్‌ తయారీ కంపెనీ అట్లాస్‌ అధినేత సంజయ్‌ కపూర్‌ భార్య నటాషా కపూర్‌ (57) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దిల్లీ, ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో నటాషా కపూర్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణం చెందారు.

మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని గంగారాం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

లోధి రహదారిలోని శ్మశానవాటికలో నటాషా అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే మృతదేహం పక్కనే పోలీసులకు ఓ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

నటాషా బలవన్మరణానికి పాల్పడిన సమయంలో భర్త సంజయ్‌ ఇంట్లో లేరు. ఆమె కుమార్తె, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు.

ఇదీ చూడండి: మాజీ క్రికెటర్​ అజారుద్దీన్​పై చీటింగ్​ కేసు

ఇదీ చూడండి: మీ చివరి కోరిక ఏంటి?... నిర్భయ దోషులకు నోటీసులు

Intro:Body:

Kejriwal road show

Conclusion:
Last Updated : Feb 18, 2020, 2:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.