ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన అమిత్ పంగల్ తొలిసారి ఈ టోర్నీలో అడుగుపెడుతుంటే... శివథాపా మాత్రం వరుసగా నాలుగోసారి పతకం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. వచ్చే నెలలో మొదలవుతున్న ఆసియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో వీరిద్దరూ పాల్గొనున్నారు. అమిత్ 52 కేజీలు, శివథాపా 60 కేజీల విభాగంలో పోటీకి దిగనున్నారు.
బ్యాంకాక్ రాజధాని థాయ్లో ఏప్రిల్ 19 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. పురుషులతో పాటు మహిళల ఛాంపియన్షిప్నూ నిర్వహించనున్నారు.
అరంగేట్రం అదిరేనా...
ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా స్మారక టోర్నీలో 49 కేజీల విభాగంలో పాల్గొన్న పంగల్.... పసిడి కైవసం చేసుకున్నాడు. 2020 ఒలింపిక్స్లో 49 కేజీల విభాగం తొలగించడంతో 52 కేజీల విభాగానికి మారిన ఈ హర్యానా ఆటగాడు...టోర్నీల్లో తొలుత సత్తా చాటాలని నిశ్చయించుకున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా జర్మనీలోశిక్షణ తీసుకున్నాడు.
నాలుగోసారి వేట...
భారత స్టార్ బాక్సర్ శివ థాపా.. ఇటీవల జరిగిన జీబీ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో....కాంస్య పతకం సాధించాడు. ఈ ఉత్సాహంతోనే ఆసియన్ ఈవెంట్లలో పతక వేటకు బయలుదేరుతున్నాడు.
2013 ఆసియన్ టోర్నీలో స్వర్ణం, 2015లో రజతం, 2017లో వెండి పతకాలను సాధించాడీ మాజీ ప్రపంచ ఛాంపియన్.
ఒలింపిక్స్ కోసమే ఇదంతా...
2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్లో కొత్తగా 63 కేజీల విభాగం రానుంది. ఇంతకు ముందున్న 57 కేజీల విభాగాన్ని తిరిగి తీసుకొచ్చారు. 49, 56, 60, 64 కేజీల విభాగాల్ని తొలగించారు. దీంతో 60 కేజీల విభాగంలో ఉన్న శివ థాపా సహా కామన్వెల్త్లో వెండి పతకం సాధించిన మనీష్ కూమార్.... 63 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది.
రష్యా ఏకటెరిన్బర్గ్లో సెప్టెంబరు 7 నుంచి 21 వరకు 'ప్రపంచ ఛాంపియన్షిప్' జరగనుంది.
' ఎవరైతే ఆసియన్ ఛాంపియన్ షిప్లో పసిడి, వెండి పతకాలు సాధిస్తారో...వారికే ప్రపంచ ఛాంపియన్ షిప్ ఎంపికలో తొలి ప్రాధాన్యమిస్తాం'.
-జాతీయ శిక్షకుడు, సీఏ కుట్టప్ప
ఆసియన్ ఛాంపియన్షిప్ పురుషుల జట్టు:
దీపక్(49కేజీ), అమిత్ పంగల్(52 కేజీ), కవిందర్ సింగ్ బిస్త్(56 కేజీ), శివ థాపా(60 కేజీ), రోహిత్ తోకాస్(64 కేజీ), ఆశిష్(69కేజీ),ఆశిష్ కుమార్(69కేజీ), బ్రిజేష్ యాదవ్(81కేజీ),నమన్ తన్వార్(91కేజీ), సతీశ్ కుమార్(+91 కేజీ).