ETV Bharat / briefs

విమాన సంస్థలకు 2020లో రూ.6.36 లక్షల కోట్ల నష్టం! - విమాన రంగంపై ఐఏటీఏ అంచనాలు

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది విమానయాన సంస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోనున్నట్లు విమానయాన రంగ విభాగం ఐఏటీఏ తెలిపింది. ఈ ఏడాది మొత్తం మీద విమానయాన సంస్థలు రోజుకు సగటున 230 మిలియన్​ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకోవచ్చని అంచనా వేసింది.

corona impact on aviation industry
కరోనాతో విమానయాన రంగం కుదేలు
author img

By

Published : Jun 10, 2020, 12:40 PM IST

ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు ఈ ఏడాది అత్యంత గడ్డుకాలం ఎదుర్కోనున్నట్లు ఇంటర్నేషనల్​ ఎయిర్​ ట్రాన్స్​పోర్ట్ అసోసియేషన్​ (ఐఏటీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది మొత్తం మీద విమానయాన సంస్థలు 84.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.36 లక్షల కోట్లు) నష్టాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేసింది. కరోనా వైరస్​తో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో.. విమానయాన రంగ చరిత్రలోనే 2020ని అత్యంత దారుణమైన ఏడాదిగా అభివర్ణించింది ఐఏటీఏ.

ఐఏటీఏ మరిన్ని అంచనాలు..

  • ఈ ఏడాది రోజుకు 230 మిలియన్​ డాలర్ల నష్టం నమోదు కావచ్చు.
  • ఆదాయం కూడా 2019తో పోలిస్తే 2020లో 50 శాతం తగ్గి.. 838 బిలియన్​ డాలర్ల నుంచి 419 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చు.
  • 2021లో విమానయాన రంగం నష్టాలు 15.8 బిలియన్ డాలర్లకు తగ్గొచ్చు. ఆదాయం 598 బిలియన్ డాలర్లుకు పెరిగే అవకాశాలున్నాయి.
  • ఈ ఏడాది మొత్తం మీద 220 కోట్ల మంది విమానాల్లో ప్రయాణం చేయొచ్చు. వీరిలో ఒక్కో ప్యాసింజర్​పై విమాన సంస్థలకు 37.54 డాలర్ల నష్టం రావచ్చు.

ఇదీ చూడండి:ట్విట్టర్​ కొత్త ఫీచర్​.. ఇకపై ట్వీట్లు మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.