ETV Bharat / briefs

సత్ఫలితాలిస్తున్న జైళ్ల శాఖ సంస్కరణలు

తెలంగాణ జైళ్ల శాఖ సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. ఖైదీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా ఏటా ఖైదీల సంఖ్య పెరుగుతుంటే... రాష్ట్రంలో నాలుగేళ్లలో 25 వేల 11 మంది తగ్గారు. కారాగారాల్లో ఖైదీలను అక్షరాస్యులుగా మార్చడం, ఉన్నతి పథకం ద్వారా అనేక వృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం వంటి సంస్కరణలు చేపడుతున్నారు.

సత్ఫలితాలిస్తున్న జైళ్ల శాఖ సంస్కరణలు
author img

By

Published : May 30, 2019, 2:14 PM IST

సత్ఫలితాలిస్తున్న జైళ్ల శాఖ సంస్కరణలు

రాష్ట్రంలో జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలు సత్ఫాలిస్తున్నాయి. కారగారాల్లో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఓవైపు కొత్త జైళ్లు నిర్మించేందుకు నిధులు కావాలంటూ మిగతా రాష్ట్రాలు కేంద్రాన్ని అడుగుతుంటే... మన దగ్గర మాత్రం ఖైదీలు లేక ఉన్నవే మూతబడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 17 జైళ్లు మూసి వేశారు. ఈ పరిణామంతో ఉన్న సిబ్బందిని మిగతా జైళ్లకు పంపి ఖైదీలపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 66 వేల 933 మంది రిమాండ్ ఖైదీలు,13 వేల 364 మంది శిక్ష పడ్డ ఖైదీలతో కలుపుకొని మొత్తం 80 వేల 297 మంది ఉండేవారు. 2018 నాటికి 43 వేల 823 మంది రిమాండు.. 11 వేల 463 శిక్షపడ్డ ఖైదీలను కలిపి వీరి సంఖ్య 55 వేల 286 తగ్గింది. నాలుగేళ్లలో 25 వేల 11 మంది ఖైదీలు తగ్గారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్.సి.ఆర్.బి) లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2014లో అన్ని జైళ్లలో 4లక్షల 14 వేల 396 మంది ఖైదీలు ఉంటే... 2016 నాటికి 4 లక్షల 28 వేల 741 కు పెరిగారు. దేశ వ్యాప్తంగా ఖైదీల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. తెలంగాణ జైళ్ల శాఖలో నిరక్ష రాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యా విధాన పథకం చేపట్టారు. జైళ్లకు వచ్చిన ప్రతి ఖైదీ కనీసం సంతకం పెట్టగలిగేలా చేయాలనేది దీని లక్ష్యం. ఒక్క 2018లోనే 18 వేల 675 మంది దీని ద్వారా శిక్షణ పొందారు. ఇప్పటివరకు లక్షా 25 వేల మందిని ఇలా అక్షరాస్యులుగా మార్చారు. అక్షరాస్యతతో ఖైదీల్లో అవగాహన పెరిగి.. మళ్లీ నేరబాట పట్టకుండా ఏదో ఒక ఉపాధి చేసుకునే అవకాశం ఉంటుంది.

ఖైదీల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు స్వచ్ఛంద సేవ సంస్థల సహకారంతో ఉన్నతి పథకం ప్రవేశపెట్టారు. చాలా మంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులతో సరైన సంబంధాలు ఉండవు. విడుదలై బయటకు వెళ్లినా కుటుంబ సభ్యులు ఆదరించరు. దీనితో ఖైదీలకు మళ్లీ నేర ప్రవృతి ఏర్పడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఉన్నతి పథకం కింద ఖైదీలు, కుటుంబ సభ్యులకు మానసిక నిపుణులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎవరి కాళ్లపై వారు నిలబడేలా అనేక వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు వందల మంది పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. శిక్ష అనుభవిస్తున్నా ఖైదీకి రోజుకు 100 రూపాయలు... విడుదలైన ఖైదీకి కనీసం నెలకు పన్నెండు వేల వేతనం ఇస్తున్నారు. రానున్న రోజుల్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మరో 20 పెట్రోల్ బంకులు తెరువనున్నారు. వీటి ద్వారా మరో మూడు వందల మందికి ఉపాధి కల్పించనున్నారు. దాదాపు 300 మంది ఖైదీలకు వివిధ సంస్థల్లో ఉపాధి కల్పించారు.

ఇవీ చూడండి: తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ.. "జగన్ ప్రస్థానం"

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.