ఏపీలోని కడప పట్టణంలోని నకాశ్ వీధిలో ఓ కర్మాగారంలో పనిచేస్తున్న బాలుడు ప్రమాదవశాత్తూ మరణించాడు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆహార తయారీ సంస్థను నిర్వహిస్తున్నాడు. అక్కడ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు 3 నెలల నుంచి పనిచేస్తున్నాడు. ఇవాళ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ యంత్రంలో పడి బాలుడు మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...