విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 8 మంది ఉపాధ్యాయులను జిల్లా పాలనాధికారి రోనాల్డ్‌రోస్ సస్పెండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లోని మార్కెట్ రోడ్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.... ఉదయం 9 గంటలకు ప్రార్థన ప్రారంభమైనా ఉపాధ్యాయులు హాజరుకాలేదు. 13 మంది ఉపాధ్యాయులకు గానూ ఇద్దరు సెలవులో ఉండగా... కేవలం ఇద్దరు మాత్రమే సమయానికి పాఠశాలకు వచ్చారు. అనంతరం అక్కడి పరిస్థితులు, మూత్రశాలల నిర్వహణ, హాజరుపట్టికను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎనిమిది మంది ఉపాధ్యాయులను విధుల నుంచి బహిష్కరించటంతో పాటు విద్యావాలింటర్ను కూడా తొలగిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి నోటీసులు జారీ చేశారు.
ఇవీ చూడండి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం