ములుగు జిల్లాలోని మల్లంపల్లిలో స్కూలు బస్సు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు పిలల్ని తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ తన ఇంటి వద్ద బస్సును ఆపి లోపలికి వెళ్లొచ్చాడు. అదే సమయంలో చీదల సంతోష్, సంధ్య దంపతుల కుమార్తె అక్షయ బస్సుకు ఎదురుగా నిలబడింది. డ్రైవర్‌కు అక్షయ కనిపించకపోవటం వల్ల అలాగే బస్సును ముందుకు పోనిచ్చాడు. పాప అక్కడికక్కడే మృతి చెందింది. అక్షయ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం