ETV Bharat / state

three capitals withdrawn : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం - three capitals of AP issue news

three capitals withdrawn
three capitals withdrawn
author img

By

Published : Nov 22, 2021, 11:33 AM IST

Updated : Nov 22, 2021, 12:11 PM IST

11:31 November 22

three capitals withdrawn : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

మూడు రాజధానుల చట్టాన్ని(three capitals of AP withdrawn 2021) ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్​ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లును మంత్రి వర్గం రద్దు చేసిందని.. చట్టం రద్దుపై అసెంబ్లీలో కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్లు కోర్టుకు చెప్పారు. త్రిసభ్య ధర్మాసనానికి ఏజీ వివరాలు అందజేశారు. ఈ అంశంపై విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది.

మూడు రాజధానుల చట్టాన్ని(AP three capitals act withdrawn) ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్న ఏపీ రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. 

స్వాగతించిన అమరావతి ఐకాస

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమరావతి ఐకాస(Amaravati JAC) స్వాగతించింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఏ సర్కారైనా వెనక్కి తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అమరావతిని రాజధానిగా చేస్తూ.. త్వరగా అభివృద్ధి చేయాలని కోరింది. అమరావతిని విమర్శించిన వాళ్లంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 

పాదయాత్ర కొనసాగుతుంది..

అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర(amaravati farmers padayatra news)’ నేటితో 22వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర ఇవాళ నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 13 కిలోమీటర్ల మేర సాగి కొండ బిట్రగుంటలో ముగియనుంది. అంతక ముందు రైతులు స్థానికంగా ఉన్న ఓ చర్చిలో ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు. యాత్ర ముగియకముందే ఏపీ సర్కార్ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. అయినా యాత్ర కొనసాగిస్తామని అమరావతి ఐకాస స్పష్టం చేసింది.

ఇవీ చదవండి   : 

Last Updated : Nov 22, 2021, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.